ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​కు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ లేఖ - సీఎం జగన్ తాజావార్తలు

విశాఖలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ.. సీఎం జగన్​కు లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్​ బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

letter to cm
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ

By

Published : May 24, 2021, 6:30 PM IST

విశాఖ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు.. సీఎం జగన్​కు లేఖ రాశారు. నగరంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని అందుకు తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని లేఖలో కోరారు. బ్లాక్ ఫంగస్​ బాధితులకు కేవలం ఇరవై బెడ్లు ఉన్నాయని.. ఈ వ్యాధి చికిత్సకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలన్నారు.

రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. విశాఖ జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్​ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించండి: మంత్రి ఆళ్ల నాని

ABOUT THE AUTHOR

...view details