తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. విశాఖలో రెండు బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ శాఖ అక్రమ కేసులు బనాయించిందని ఆయన ఆరోపించారు. ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అందులో కల్తీ మద్యం నింపి తెదేపా వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎక్సైజ్ శాఖ పోలీసుల తీరుకు నిరసనగా ఎంవీపీ కాలనీలో ఉన్న ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లో ఆయన రాత్రంతా నిరసన చేపట్టారు. విశాఖతూర్పు ఏసీపీ మూర్తికి ఫిర్యాదు చేసిన అనంతరం నిరసన విరమించారు. ఈ ఘటనకు సంబంధించి వెలగపూడి రామకృష్ణబాబుతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఎక్సైజ్ శాఖ పోలీసుల తీరుకు నిరసనగా రాత్రంతా స్టేషన్లో నిరసన - విశాఖలో రెండు బార్ అండ్ రెస్టారెంట్లు
విశాఖలో రెండు బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ శాఖ అక్రమ కేసులు బనాయించిందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు.ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అందులో కల్తీ మద్యం నింపి తెదేపా వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ..రాత్రంతా స్టేషన్లో నిరసన చేపట్టారు.

mla-velagapudi-ramakrishna
ఎక్సైజ్ శాఖ పోలీసుల తీరుకు నిరసనగా రాత్రంతా స్టేషన్లో నిరసన