ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Voter Deletion: ఓట్ల తొలగింపుపై.. విశాఖ కలెక్టరేట్​కు పోటెత్తిన జనం.. - Complaint to Collector on voter deletion

Voter Deletion in AP: విశాఖ కలెక్టర్​ కార్యాలయంలో ప్రజలు పోటెత్తారు. అధికారులు అకారణంగా వారి ఓట్లను తొలగించారని వాపోయారు. దశాబ్దాల కాలం నుంచి విశాఖలో ఉంటున్న.. విశాఖలో ఓట్లు తొలగించటమేంటని ప్రశ్నించారు. దీనిపై జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు.

Velagapudi Complaint to Collector
ఓట్ల తొలిగింపుపై విశాఖ కలెక్టర్​కు ఫిర్యాదు

By

Published : Jun 14, 2023, 12:16 PM IST

విశాఖలో ఓట్ల గల్లంతుపై కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన ఓటర్లు

Mla Velagapudi Met Vishaka Collector: విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓట్ల గల్లంతుపై భారీగా ఫిర్యాదుల పర్వం ప్రారంభమైంది. పత్రికల్లో వార్తలు రావడంతో ఓట్లు మాయమైన ప్రజలు కలెక్టరేట్‌కు పోటెత్తారు. వార్డులు, బూతుల వారీగా.. తొలగించిన ఓట్లను మళ్లీ తిరిగి నమోదు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఓట్ల తొలగింపునకు కారకులైన వాలంటీర్లతో పాటు, సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది. ఇష్టానుసారంగా ఓట్లు తొలగించారని.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జాబితా నుంచి.. ఓటు ఎప్పుడు తొలగించారో కూడా తమకు తెలియదన్నారు. దశాబ్దాలుగా ఒకే చిరునామాలో ఉన్న ఓట్లు సైతం పోయాయని మండిపడ్డారు. ఒక్క తూర్పు నియోజక వర్గంలో దాదాపు 40 వేల ఓట్లు తొలగించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఓటర్లతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన వెలగపూడి: విశాఖ తూర్పు నియోజకవర్గంలో వార్డులు, బూతులవారీగా ఓట్ల గల్లంతుపై .. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపునకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారిని కోరారు. అనంతరం ఆయన విశాఖ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించకుండా ఇష్టానుసారంగా ఓట్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఓటర్ జాబితా నుంచి ఓటర్లను తొలగించినప్పుడు కనీసం ఎందుకు తొలగిస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పలేదన్నారు.

"నా పేరు రామలక్ష్మి. మాది 15వ వార్డు కొత్త వెంకాజీ పాలెం. నా ఓటు పోయిందని తెలిసింది. ఎందుకు పోయిందో కారణమెంటో మాకు ఏ సమాచారం లేదు. మా ఇంటికి ఎవరు వచ్చి సర్వే చేయటం వంటి ఏమి చేయలేదు. నేను ఎప్పటికి ఇంటి దగ్గరే ఉంటాను." -రామలక్ష్మి, ఓటు కోల్పోయిన మహిళ

"విశాఖ తూర్పు నియోజవర్గంలో సుమారు 40 వేల ఓట్లను తొలగించారు. జగన్​మోహన్​ రెడ్డి ప్రభుత్వం, ఈ కార్పోరేటర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కొంతమంది అధికారులు కుమ్మక్కై ఈ ఓట్లను తొలగించారు. గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇదే విషయం చెప్పాను. ఇప్పుడు కలెక్టరుకు కూడా అదే చెప్తాను." -ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ తూర్పు నియోజకవర్గం

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దశాబ్దాలుగా ఒకే చిరునామాలో వున్న ఓట్లు తొలగించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఒక్క విశాఖ తూర్పు నియోజకవర్గంలోనే దాదాపు 40 వేల ఓట్లు విచారణ జరపకుండా తొలగించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ గెలవదనే భయంతో ఓట్లు తొలగించారని విమర్శించారు. దీనికి బాద్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని.. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీనిపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు.

గతంలో దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసినట్లు.. మరోసారి కూడా కలిసి విన్నవిస్తామని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని అన్ని బూత్​ల పరిధిలో భారీగా ఓట్లు తొలగించారని మండిపడ్డారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓట్లను.. ఓటర్లకు దూరంగా ఉండే బుత్​లలో ఓట్లను కేటాయించారని అన్నారు. దీంతో తమ పరిధిలో లేని కొత్త ఓట్లను బూత్​ లేవల్​ ఆఫీసర్లు తొలగిస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details