ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ వారివల్ల ముఖ్యమంత్రి కాలేరు: ఎమ్మెల్యే వాసుపల్లి - వాసుపల్లి తాజా వార్తలు

తెలుగుదేశం తరఫున గెలిచి వైకాపా పంచెన చేరిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ ఆధిపత్య పోరుతో అక్కడ ఇమడలేక పోతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌తో మెుదట్నుంచి విభేదిస్తున్న గణేశ్.. విజయసాయిరెడ్డి పేరు అడ్డుపెట్టుకుని సీతంరాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాహాటంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు.

వారి వల్ల జగన్ ముఖ్యమంత్రి కాలేరు
వారి వల్ల జగన్ ముఖ్యమంత్రి కాలేరు

By

Published : May 7, 2022, 6:08 PM IST

వారి వల్ల జగన్ ముఖ్యమంత్రి కాలేరు

తెలుగుదేశం తరఫున గెలిచి వైకాపా పంచెన చేరిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ ఆధిపత్య పోరుతో అక్కడ ఉక్కపోతకు గురవుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌తో గణేశ్‌కు పడడంలేదు. విజయసాయిరెడ్డి పేరు అడ్డుపెట్టుకుని సీతంరాజు సుధాకర్‌.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాసుపల్లి గణేశ్‌ బాహాటంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. రాజ్యసభ సభ్యుల వల్ల జగన్ మళ్లీ సీఎం కాలేరని, ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డికీ ఈ సందర్భంగా చురకలు అంటించారు.

ఉత్తరాంధ్ర వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేసిన విజయసాయికి.. ఈ విషయం ఎందుకు అర్థం కాలేదో తెలియలేదన్న గణేశ్‌.. కాత్తగా వచ్చిన సుబ్బారెడ్డైనా సమస్య పరిష్కరించాలని ఆకాంక్షించారు. నగరంలోని ఓ ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన గణేశ్‌ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్‌తో విభేదాలు ఉన్నాయా ? అని విలేకరులు ప్రశ్నించగా గణేశ్‌ పైవిధంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details