ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతిని జగన్​ ఖూనీ చేశారు: వాసుపల్లి గణేష్​ - mla vasupalli ganesh latest news update

అప్పుల రాజ్యం, రౌడీ రాజ్యం రాష్ట్రాన్ని ఏలుతోందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో 'సీఎం జగన్ విధ్వంసానికి ఒక్క ఛాన్స్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే జగన్ రూ.82 వేల కోట్లు అప్పు చేశారని.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సున్నా స్థాయికి పడిపోయిందని విమర్శించారు.

mla vasupalli ganesh opening book
పుస్తకాన్ని ఆవిష్కరించిన వాసుపల్లి గణేష్​

By

Published : Jun 9, 2020, 3:58 PM IST


అమరావతిని జగన్ చంపేశారని.. హైదరాబాద్​ను చంద్రబాబు అభివృద్ధి చేయబట్టే.. కేసీఆర్ కాలు మీద కాలు వేసి కూర్చున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలను తరిమేశారని దుయ్యబట్టారు.

విశాఖలోని తెదేపా కార్యాలయంలో 'సీఎం జగన్ విధ్వంసానికి ఒక్క ఛాన్స్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో అన్ని కీలక పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని.. పేర్ల చిట్టాను చూపించారు. బీసీ, ఎస్సీ, కాపు, మైనార్టీల నిధులను అమ్మ ఒడి పథకానికి మళ్లించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో పాటు పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details