బీసీలపై ప్రభుత్వం దాడులు చేస్తుందంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్... విశాఖలో చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశించారు. బీసీలను హంతకుల మాదిరిగా చిత్రీకరించి... అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు, యనమలపై తప్పుడు కేసులు పెట్టారని... ఇప్పుడు కొల్లు రవీంద్రపైనా అదే పని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మంచిపేరు ఉన్న తెదేపా నేతలపై బురదజల్లేందుకు వైకాపా నడుం కట్టిందని... ఇప్పటివరకు 65 మంది తెదేపా నేతలపై కేసులు పెట్టారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదా?: ఎమ్మెల్యే వాసుపల్లి - విశాఖపట్నం జిల్లా తాజా వార్తలు
బీసీలపై ప్రభుత్వం దాడులకు వ్యతిరేకంగా చేతులకు సంకెళ్లు వేసుకొని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు స్థానం లేదా అని ప్రశ్నించారు.

చేతులకు సంకెళ్లు వేసుకొని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖలో నిరసన