ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణాలు తొలగించేందుకు జీవీఎంసీ అధికారుల యత్నం.. అడ్డుకున్న ఎమ్మెల్యే - ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాజా వార్లు

విశాఖ లక్ష్మీ టాకీస్ వద్ద రోడ్డు పక్కన ఉన్న దుకాణాల తొలగింపు సమయంలో.. ఆందోళన నెలకొంది. జీవీఎంసీ అధికారులు దుకాణాలు తొలగిస్తున్న విషయం తెలుసుకుని.. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. దుకాణదారులకు మద్దతుగా నిలిచారు.

mla vasupalli ganesh ganesh agitation over removal of shops at lakshmi talkies road ad vishaka
దుకాణాలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు.. అడ్డుకున్న ఎమ్మెల్యే

By

Published : Jul 20, 2021, 2:15 PM IST

విశాఖ లక్ష్మీ టాకీస్ వద్ద రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను.. జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్న క్రమంలో.. ఉద్రిక్తత నెలకొంది. దుకాణాలను తొలగిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. అక్కడకు చేరుకుని బాధితులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గం, 39 వ వార్డులో జీవనోపాధి కోసం 25 ఏళ్లుగా నడుపుతున్న షాపులను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ మహిళలు ఆవేదన చెందారు. వైకాపాకు పనిచేశారనే కక్ష సాధింపుతో.. స్థానిక ఇండిపెండెంట్ కార్పొరేటర్ దుకాణాలను తొలిగించాలంటూ జీవీఎంసీకి ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దుకాణాలను కూలగొట్టేందుకు వచ్చిన జేసీబీ వాహనాలను అడ్డుకుని ఎమ్మెల్యే నిరసన తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details