ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అధికార పార్టీపై తెదేపా అసత్య ప్రచారం ఎక్కువ చేస్తోందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం మల్లవరం రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. తన అనుచరులు అటవీ ప్రాంతంలో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు చేస్తున్నట్లు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తెదేపాలో వివిధ పదవులు పొందిన ఆ పార్టీ నాయకుడు కొండలరావు జిరాయతీ భూమిలో మట్టి తవ్వుకుంటే మాకేంటి సంబంధమని ప్రశ్నించారు. వాస్తవం తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే గౌరవం తగ్గిపోతుందనే విషయం తెలుసుకోవాలన్నారు. వైకాపా మెరుగైన పాలనను చూసి తట్టుకోలేక బురదజల్లుడు రాజకీయం చేయడం వారికి తగదని చెప్పారు.
జగనన్న విద్యా దీవెన కింద ఆర్థిక సహాయం
ఉన్నత చదువులు చదువుకోడానికి పేదలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని.. అందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన కింద ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల వద్ద ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.