ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSRCP MLA Ramanamurthy Raju News: వేషం మార్చి.. ప్రజా సమస్యలపై ఆరా - ఎలమంచిలి వైకాపా ఎమ్మెల్యే రమణమూర్తిరాజు

Mla Ramanamurthy Raju in swamiji appearance: ఓ స్వామీజీ ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. గ్రామాల్లో పర్యటించి వైకాపా పాలనలోని నవరత్నాలపై ప్రజలు ఏమి అనుకుంటున్నారని తెలుకుసున్నారు. అయితే ఇలా వేషం మార్చి పర్యటిస్తున్న ఆ స్వామీజీ మరెవరో కాదు.. సాక్షాత్తూ ఎలమంచిలి వైకాపా ఎమ్మెల్యే రమణమూర్తిరాజు(కన్నబాబు).

YSRCP MLA Ramanamurthy Raju News
స్వామీజీ వేషంలో వైకాపా ఎమ్మెల్యే రమణమూర్తిరాజు

By

Published : Dec 22, 2021, 10:29 AM IST

YSRCP MLA Ramanamurthy Raju in swamiji appearance: నుదుటన విభూది, చలువ కళ్లద్దాలు, కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షమాలతో ఓ స్వామీజీ.. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరాతీశారు. అచ్యుతాపురం మండల కేంద్రంతోపాటు ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించి వైకాపా పాలనలోని నవరత్నాలపై ప్రజలు ఏమి అనుకుంటున్నారని ఆరా తీశారు. ఈ స్వామీజీ మరెవరో కాదు.. సాక్షాత్తూ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు).

ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీరుతెన్నూ మార్చేసి... మారువేషం వేసి మరీ గ్రామాల్లో పర్యటించారు. నిత్యావసర ధరలు, విద్యుత్తు ఛార్జీలు అధికంగా ఉన్నాయని పలువురు చెప్పారు. రోడ్లు బాగోలేవని ప్రస్తావించారు. ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే ధరలు పెరుగుదలతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నేరుగా తహసీల్దార్‌, ఎంపీడీవో ఆఫీస్​కు..

YSRCP MLA Ramanamurthy Raju News: ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న తర్వాత నేరుగా తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ కృష్ణల వద్దకు ఇదేవేషంలో వెళ్లిన కన్నబాబు ప్రజలు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడారు. ఇన్ని విషయాలు అడుగుతున్నారు... మీరెవరంటూ తహసీల్దార్‌ రాంబాయి ప్రశ్నిస్తే.. వేషం తొలగించి ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి...

CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details