కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. పీఆర్ టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన మహిళా వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ప్రమాదకర వ్యాధికి మానవతా దృక్ఫథంతో సేవలందించడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, కార్యదర్శి అప్పారావు, వైద్యులు పాల్గొన్నారు.
మహిళా వైద్యులను సత్కరించిన ఎమ్మెల్యే ఉమాశంకర్ - నర్సీపట్నంలో స్వతంత్ర వేడుకలు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో పీఆర్ టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ పాల్గొన్నారు. కరోనా కాలంలో బాధితులకు సేవలందించిన వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.
![మహిళా వైద్యులను సత్కరించిన ఎమ్మెల్యే ఉమాశంకర్ మహిళా వైద్యులను సత్కరించిన ఎమ్మెల్యే ఉమాశంకర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8432964-808-8432964-1597502011178.jpg)
మహిళా వైద్యులను సత్కరించిన ఎమ్మెల్యే ఉమాశంకర్