అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం... విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఘనంగా ముగించారు. రామజన్మభూమి తీర్థ ట్రస్టు, ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మిక సంఘాల సభ్యులు.. ప్రచార రథంతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటికి వెళ్లారు.
ఎమ్మెల్యే దంపతులు రథంలో ఉన్న శ్రీరాముడి చిత్రపటాన్ని దర్శించుకొని.. హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జనవరి 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు రూ. 2.5 లక్షలు సేకరించినట్లు.. నిధి సేకరణ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు.