ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం' - విశాఖ స్టీల్ ప్లాంట్​పై ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వ్యాఖ్యలు

32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని..అలాంటి ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హెచ్చరించారు. కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపమని తెలిపారు.

mla nagireddy  will be protest for  visakha steel plant
గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

By

Published : Feb 5, 2021, 8:45 PM IST

గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్​పరం కానివ్వమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖ వైకాపా కార్యాలయంలో స్పష్టం చేశారు. పరిశ్రమ కోసం ప్రజల నుంచి 26 వేల ఎకరాలు తీసుకుని.. 8,600మందికి ఉద్యోగమిచ్చారని.. మిగతా 8,600 మంది రోడ్డుమీదే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దిల్లీ రైతులను మించి దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

32 మంది ప్రాణ త్యాగంతో ఉక్కు పరిశ్రమ ఏర్పడితే.. ఆ ప్లాంట్​ను కాపాడుకోవడానికి ఎంతమంది ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడే స్థితి వస్తుందని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details