గిరిజన రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఆచార్య ఎన్.జీ. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుండడం అభినందనీయమని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. విశాఖ ఏజెన్సీలో గిరి రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో సేంద్రీయ పంటలు పండిస్తున్నప్పటికీ కనీస మద్దతు ధరలు లభించక తీవ్రంగా నష్టపోయేవారని తెలిపారు. ఈ దశలో గిరి రైతులకు శాస్త్ర పరిజ్ఞానం అందించేందుకు ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
'శాస్త్ర సాంకేతికత వైపు గిరి రైతులు..' - పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళీ భాగ్యలక్ష్మి తాజా వార్తలు
గిరిజన ప్రాంతాలకు అనుకూలమైన సాగు పద్ధతులను అభివృద్ధి పరచడం, అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సరళిపై పరిశోధనలు నిర్వహించి వాటి ఫలితాలను రైతులకు అందించడంలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఎనలేనిదని విశాఖ జిల్లా పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.
!['శాస్త్ర సాంకేతికత వైపు గిరి రైతులు..' mla Kotagulli Bhagya Lakshmi in Kisan Mela](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6205242-728-6205242-1582691865083.jpg)
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా
ఇవీ చూడండి...