'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పునఃప్రారంభిస్తాం' - MLA karunam dharmasri on utharandhra sujala sravanthi project news
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు తిరిగి ప్రారంభించే అంశంపై... చోడవరం ఎమ్మెల్యే జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు.
!['ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పునఃప్రారంభిస్తాం' MLA karunam dharmasri on utharandhra sujala sravanthi project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5194036-1042-5194036-1574852962477.jpg)
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జల వనరుల శాఖ అధికారులతో ఈ ప్రాజెక్టు అంశంపై చర్చించారు. ఆగిన పనులు పునఃప్రారంభం అయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వల్ల చోడవరం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, 109 పంచాయతీలకు తాగునీటి సదుపాయం కలుగుతుందని వివరించారు. సమావేశంలో పాల్గొన్న పంగిడి గ్రామస్థులు ప్రాజెక్టు రావడాన్ని వ్యతిరేకించారు.
ఇదీ చదవండి : రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలివే..!