ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అరెస్టు.. స్టేషన్ బెయిల్ - visakha district news

15:42 February 06
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి బంధువును బెదిరించారని కేసు
విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు (యూవీ రమణమూర్తిరాజు)ను పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై రాంబిల్లి పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడిచి పెట్టారు. మూడు రోజుల కిందట బరిలో ఉన్న వార్డు సభ్యుడి అల్లుడిని ఆయన ఫోన్‌లో బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో బాధితుడు ఎమ్మెల్యేపై రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి.. స్టేషన్ బెయిల్‌పై విడిచిపెట్టారు.
ఇదీ చదవండి:
ఎలమంచిలి ఎమ్మెల్యే బెదిరించారంటూ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు