ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా నేతలకు ప్రాంతీయ అభిమానం లేదు' - amaravathi 3 capital news

విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు శాసనమండలిలో వ్యవహరించారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఈ ప్రాంతవాసిగా బుద్ధ అలా చేయడం తగదన్నారు.

'వాళ్లు ప్రాంతీయ అభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారు'
'వాళ్లు ప్రాంతీయ అభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారు'

By

Published : Jan 25, 2020, 12:46 PM IST

తెదేపాపై అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్​ విమర్శలు

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే కొంతమంది తెదేపా నాయకులు ప్రాంతీయ అభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారని.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ విమర్శించారు. శాసనమండలిలో ఆర్థిక నేరగాళ్లు ఉంటే వారి నుంచి మంచి సలహాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అందుకే శాసనమండలిని ఉంచాలా? లేదా? అనే విషయంపై సోమవారం అసెంబ్లీలో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. బుద్ధ ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details