ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో వయో ఆరోగ్య సేవ విభాగం ప్రారంభం - mla Gudivada Amarnath inaugurate elderly Department in the ntr hospital at anakapalli

ఎన్టీఆర్ ఆస్పత్రిలో వయోఆరోగ్య సేవ విభాగాన్ని అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు.

former minister dhadi veerabhadrarao

By

Published : Oct 2, 2019, 11:00 PM IST

అనకాపల్లిలో వయోఆరోగ్య సేవ విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్నాథ్

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో వయో ఆరోగ్య సేవ విభాగాన్ని శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన వార్డులో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి కావల్సిన సదుపాయాలను కల్పించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అనకాపల్లి హాస్పిటల్ లో సిబ్బంది కొరత అధికంగా ఉందని.. దీన్ని పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తిరుపతి రావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details