ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రవీణ్ చక్రవర్తి వీడియో ఐదేళ్ల క్రితం నాటిది: ఎమ్మెల్యే అమర్నాథ్ - ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వార్తలు

రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు రాజకీయాల కోసం రాములోరినీ వాడేసుకుంటున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న ప్రవీణ్ చక్రవర్తి వీడియో... ఐదేళ్ల క్రితం నాటిదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు, సోము వీర్రాజు గుర్తించాలని సూచించారు.

mla amarnath
mla amarnath

By

Published : Jan 17, 2021, 10:11 PM IST

సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా, తెదేపా నేతలు విమర్శలు చేస్తున్నారని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న ప్రవీణ్ చక్రవర్తి వీడియో... ఐదేళ్ల క్రితం నాటిదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు, సోము వీర్రాజు గుర్తించాలని సూచించారు. అప్పట్లో అధికారంలో ఉన్న తెదేపా.. అతనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయాల కోసం రాములోరినీ వాడేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details