కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూచించారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఆర్డివో సీతారామారావు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తితో సమావేశమయ్యారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్లు పరిశీలించారు.
'కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడండి' - విశాఖలో కంటోన్మెంట్ జోన్లు తాజా వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరనా తీవ్రత ఉన్న గవరపాలెం, చింత వారి వీధి ప్రాంతాలను అధికారులు కంటైన్మెెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ పర్యటించారు. పరిస్థితిని పరిశీలించారు.
!['కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడండి' mla gudivada amarnadh reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7543941-255-7543941-1591718649223.jpg)
కంటోన్మెంట్ జోన్లలో ఎమ్మెల్యే పర్యటన