గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా.. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పాయకరావుపేటలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం - ap fisheries corporation director in payakaraopeta celebrations
విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం వేడుకగా జరిగింది. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులను గుర్తించి.. వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే బాబురావు గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

వినతి పత్రం సమర్పిస్తున్న మత్స్యకారులు
మత్స్యకారుల అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. అనంతరం మత్స్యకారులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని వారికి అందజేశారు.