ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య సేవలపై ఎమ్మెల్యే గణేష్ ఆరా - MLA Ganesh news

కొవిడ్ రోగులకు అందుతున్న వైద్యసేవలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించి.. వైద్యులకు పలు సూచనలు చేశారు.

వైద్యసేవలపై ఎమ్మెల్యే ఆరా
వైద్యసేవలపై ఎమ్మెల్యే ఆరా

By

Published : Apr 27, 2021, 12:53 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక ఆసుపత్రిలోని కరోనా సోకిన రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సాధారణ ప్రజలకు వేయాల్సిన మలి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆసుపత్రిలోని కొవిడ్ రోగులకు వెంటిలేషన్ ఆక్సిజన్ వంటి సదుపాయాలపై ఎమ్మెల్యే గణేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఇటు మైదాన ప్రజలకు అటు గిరిజనులకు మూలకేంద్రంగా ఉన్నందున వైద్య సదుపాయాల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా సేవలు మరింత విస్తృతం చేయాలని వైద్యులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details