ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం గారూ.. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి' - విశాఖలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వార్తలు

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సీఎం జగన్​కు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే లేఖ రాశారు. వారిని తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

MLA Ganababu wrote a letter to the CM on the issues of construction workers
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే గణబాబు

By

Published : Sep 29, 2020, 7:56 PM IST

విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సీఎం జగన్​కు లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమనిధిని వేరే అవసరాలకోసం వాడొద్దని కోరారు. సంవత్సర కాలంగా నష్టపోయి కష్టపడుతున్న కార్మికులను ఆదుకోవాలన్నారు.

ఇప్పటికే ఇసుక కొరత కారణంగా ఆరు నెలలు పాటు నిర్మాణ రంగం కుదేలయిందని చెప్పారు. కరోనా కారణంగా దాదాపు ఫిబ్రవరి నుంచి కార్మికులు పనులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.

ABOUT THE AUTHOR

...view details