విశాఖ జిల్లా గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తండ్రి, తెదేపా మాజీ ఎంపీ అప్పల నరసింహం జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఏటా తన తండ్రి పుట్టిన రోజు నాడు ఈ కార్యక్రమ నిర్వహణ ఆనవాయితీగా చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.
ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పదవిలో ఉన్నా.. లేకపోయినా.. అప్పల నరసింహం ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.