విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై హైపవర్ కమిటీ నివేదికలోని అంశాలను పక్కాగా అమలు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యే గణబాబు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. నీరబ్ కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నివేదిక.. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రతిబింబించేలా ఉందన్నారు. వాటిని అమలుచేసి బాధితులకు న్యాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
పరిశ్రమను జనావాసాల నుంచి తరలించాలని ఎమ్మెల్యే కోరారు. బాధిత ప్రాంతాల్లో ఇంకా చాలామందికి పరిహారం అందాల్సి ఉందని.. బాధితులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించాలని కోరారు. ఘటన తర్వాత చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారని.. వారికి పరిహారం అందేలా సీఎం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.