అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు డిమాండ్ చేశారు. సొంత స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. అధికారులు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయినా పంపిణీలో జాప్యం చేస్తున్నారని తెలిపారు.
నిర్మించిన ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి: ఎమ్మెల్యే గణబాబు - విశాఖ జిల్లా తాజా వార్తలు
ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయినా పంపిణీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల బాధ్యతా రాహిత్యంపై ఆయన మండిపడ్డారు. మధ్యతరగతి కుటుంబాలకు స్లమ్ క్లియరెన్స్ ప్రాజెక్ట్ ఫలితాలు అందకా అద్దె ఇళ్లలో బతుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్లమ్ క్లియరెన్స్ ప్రాజెక్ట్ కింద గౌరీనగర్, చాకలిగెడ్డ తదితర ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని వివరించారు. అయినా స్థానిక పేదలకు ఇళ్లను పంపిణీ చేయకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేల మధ్యతరగతి కుటుంబాలు అప్పు చేసి ఈ పథకానికి డీడీలు చెల్లించారని, ప్రతి నెల వడ్డీ కట్టుకుంటూ బతుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించి పూర్తయిన ఇళ్లను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో రెండో విడత ‘సిరో సర్వేలెన్స్ సర్వే’