ఇళ్ల పట్టాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వకుండా తనపై విమర్శలు చేయటమేంటని గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పాంప్లేట్లను ఇళ్ల స్థలాల పట్టాలని చెప్పి పంపిణీ చేశారన్నారు. కేవలం లబ్ధిదారులు అని తెలియచేయటానికి తప్ప.. స్థలం ఎక్కడ, ఎంత ఇస్తున్నారనేది అందులో పొందుపరచలేదని తెలిపారు.
ప్రచార పత్రాలు ఇచ్చి ఇళ్ల పట్టాలని మోసం చేస్తారా?: ఎమ్మెల్యే గణబాబు - MLA Gana babu latest news
ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని విశాఖ జిల్లా గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. ప్రచార పత్రాలను ఇచ్చి పట్టాలని చెబుతున్నారే కానీ... ఎక్కడ స్థలం ఉందో ఎంత ఇస్తున్నారో చెప్పడం లేదని విమర్శించారు.
ఎమ్మెల్యే గణబాబు
గతంలో టిడ్కో ఇళ్లకు డీడీలు కట్టిన చాలా మంది పేర్లు తుది జాబితాలో లేవని ఎమ్మెల్యే అన్నారు. టిడ్కో గృహాల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా తెదేపా అండగా నిలుస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:విశాఖలో తెదేపా కార్యాలయ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే