విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో వృక్ష సమితి ఆధ్వర్యంలో మెుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. రోలుగుంట మండలం కుసర్లపూడి, జె.పి అగ్రహారం గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు, సచివాలయం వాలంటీర్లకు వృక్ష సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మెుక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ కరణం మాట్లాడుతూ..జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అందజేసిన మెుక్కలు అనుకూలమైన వాతావరణంలో నాటి.. వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులు స్వీకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
మెుక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - విశాఖ జిల్లాలో మెుక్కలను పఁపిణీ చేసిన ఎమ్మెల్యే
విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో వృక్షమిత్ర సమితి ఆధ్వర్యంలో మెుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కరణం ఉచితంగా మెుక్కలను పంపిణీ చేశారు.

మెుక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
TAGGED:
విశాఖ జిల్లా వార్తలు