విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 78 ఎంపీటీసీ స్థానాలలో... 75 స్థానాలలో వైకాపా అభ్యర్థులే గెలుస్తారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం, బుచ్చయ్యపేట మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిందని.. ఇక పాలనపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్యే వారితో అన్నారు. సమన్వయంతో ముందుకు నడవాలన్నారు. ఈ భేటీలో బొడ్డేడ సూర్యనారాయణ, ఏడువాక సత్యారావు, చందు రాంబాబు, ఎంపీపీ అభ్యర్థి గాడి కాసు, జడ్పీటీసీ అభ్యర్థి మారిశెట్టి విజయ శ్రీ కాంత్ పాల్గొన్నారు.
'78 స్థానాలకు గానూ..75 స్థానాలు వైకాపే గెలుచుకుంటుంది' - చోడవరంలో ఎమ్మెల్యే సమావేశం
విశాఖ చోడవరం నియోజకవర్గంలో జరిగిన పరిషత్ ఎన్నికలలో వైకాపా 78 స్థానాలకూగానూ..75 స్థానాలు గెలుస్తుందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. సర్పంచులు, పరిషత్ అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కరణం