విశాఖను రాజధాని చేయాలంటూ చోడవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ
By
Published : Jan 10, 2020, 6:14 PM IST
ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ
విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ వైకాపా నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు చోడవరంలో ర్యాలీ నిర్వహించారు. రెండు పత్రికలు కావాలనే అమరావతిలో ఆకాశహర్మ్యాలు ఉన్నట్లు రాశాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు చేష్టలతో ఉత్తరాంధ్ర ఉడుకుతోందని అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై విరుచుకుపడ్డారు.