విశాఖ జిల్లా చింతపల్లి(chintapally) మండలం భవుర్తి పాఠశాలలో.. ఉపాధ్యాయులు లేకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ(MLA Bhagyalakshmi) ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతపల్లి మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే.. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడాన్ని గమనించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు.. సస్పెన్షన్‌కు గురికాగా.. ఆయన స్థానంలో మరొకరిని తాత్కాలికంగా నియమించారు. అతను సైతం రావడం లేదని గ్రామస్తులు వివరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఈ సారి ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధికారులు.. మారుమూల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాలని అధికారులు, స్థానికులకు సూచించారు.
MLA Outrage: ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయండి.. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం - పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవటంపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం
విశాఖ జిల్లా చింతపల్లి మండలం భవుర్తిలోని పాఠశాలలో.. ఉపాధ్యాయులు లేకపోవడంపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆగ్రహించారు. ఈ సారి ఉపాధ్యాయుడు పాఠశాలకు వస్తే.. చెట్టుకు కట్టేసి తగిన బుద్ధి చెప్పాలంటూ మండిపడ్డారు.
ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయండి.. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం