ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జి.మాడుగుల జీసీసీ గోదాంలో రికార్డులు పరిశీలించిన ఎమ్మెల్యే - mla checking gcc godown in visakha

రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఫిర్యాదులపై విశాఖ జిల్లా జి.మాడుగులలోని జీసీసీ గోదాంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

జి.మాడుగుల జీసీసీ గోదాంలో రికార్డులు పరిశీలించిన ఎమ్మెల్యే
జి.మాడుగుల జీసీసీ గోదాంలో రికార్డులు పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : Apr 28, 2020, 11:53 PM IST

విశాఖ జిల్లా జి.మాడుగుల జీసీసీ గోదాంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తనిఖీ చేశారు. రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఫిర్యాదుతో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. బియ్యం అక్రమ రవాణా తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రికార్డుల్లో లెక్కలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details