వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన135రోజుల్లో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి చూపించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు.రెండు రోజులు విశాఖ పర్యటన చేసిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలు సమీక్షించుకోవటం మరచి,సీఎం జగన్ పాలనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
అభివృద్దిని ఓర్చుకోలేకే సీఎంపై ఆరోపణలు:ఎమ్మెల్యే గుడివాడ - mla amarnath press meet in vishaka
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేకే, ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
విశాఖ మీడియా సమావేశంలో గుడివాడ అమర్ నాథ్