ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న సన్నిధిలో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు - Kambhapati Haribabu visits vishaka simhadri appana temple

విశాఖ సింహాద్రి అప్పన్నను మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదాలు అందించారు.

Mizoram Governor Kambhapati Haribabu
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు

By

Published : Jul 14, 2021, 10:42 AM IST

మిజోరం నూతన గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు సతీ సమేతంగా .. విశాఖ సింహాచల శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలుకుతూ, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. తనను గవర్నర్ గా నియమించినందుకు... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు హరిబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల్లోని మిజోరం ప్రగతికోసం స్వామివారి ఆశీస్సులు కోరారనని హరిబాబు చెప్పారు. స్వామివారి ఆశీస్సులు తీసుకెళ్లడానికే సింహాచలం వచ్చానని చెప్పుకొచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. మన సింహాచలం శ్రీవరాహనరహసింహస్వామి అని కొనియాడారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను హరిబాబుకు అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details