అరకు పర్యాటకులకు కొత్త అద్దాల బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాల్తేర్ అధికారులు కృషి చేస్తున్నారు. కార్తీకమాసం వనభోజనాల సీజన్ మొదలవడంతో ఆ బోగీలను వీలైనంత త్వరగా పట్టాలపైకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.
TRAIN TRAIL RUN: అరకు మార్గంలో.. అద్దాల రైలు ట్రయల్ రన్ - ap 2021 news
కార్తీకమాసం వనభోజనాల సీజన్ మొదలవడంతో.. అరకు పర్యాటకుల కోసం కొత్త అద్దాల బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాల్తేర్ అధికారులు కృషి చేస్తున్నారు.

అరకు మార్గంలో అద్దాల రైలు ట్రయల్ రన్
ఇందులో భాగంగా.. ఇప్పటికే ఓసారి అద్దాల బోగీల రైలు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు.. తాజాగా.. మంగళవారం మరోసారి ట్రయల్ రన్ నిర్వహించారు. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో గతంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించిన అనంతరం.. ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పట్టాలెక్కించాలనే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదు.
ఇదీ చూడండి:గాయపడిన విద్యార్థులను నేడు పరామర్శించనున్న నారాలోకేశ్