విశాఖలో సింహాచలం దేవస్థాన అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ దళిత దంపతులు ఉన్నతాధికారులకు విన్నవించారు. తమపై జరిగిన దౌర్జన్యం చేసిన వీడియోలను అరిలోవ పోలీసు స్టేషన్లో అధికారులకు సమర్పించారు.
సింహాచలం ఆలయ అధికారుల తీరుపై దళిత దంపతుల ఫిర్యాదు - సింహాచల దేవస్థాన అధికారులపై దళిత దంపతుల ఫిర్యాదు
విశాఖ జిల్లా సింహాచలం దేవస్థాన అధికారులు... భూమి విషయంలో తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ దళిత దంపతులు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఉద్యోగులు తమపై ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని వారు అవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని కృష్ణాపురంలోని సర్వే నెంబర్ 28/1లో... 2.88 ఎకరాల రాయితీ భూమి వారసత్వంగా తమకు వచ్చిందని, దీనిపై న్యాయస్ధానంలో కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా... దేవస్ధానం ఉద్యోగులు దౌర్జన్యంగా తమ గోడను కూల్చి వేశారన్నారు. ఉద్యోగులు తమపై ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని వారు అవేదన వ్యక్తం చేశారు. న్యాయస్ధానం తీర్పు, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను సైతం పక్కన పెట్టి కింది స్థాయి ఉద్యోగులు వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా కలిచి వేసిందని వారు ఆరోపించారు.
ఇదీ చదవండి:సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుదుత్పత్తికి ఇబ్బందులుండవు- ఏపీ జెన్‌కో పర్యవేక్షక ఇంజినీర్
TAGGED:
vishaka latest news