ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీతమ్మధారలో కొలువైన ఆలయాలను దర్శించుకున్న మంత్రులు - visakhapatnam city newsupdates

విశాఖపట్నం నగరం సీతమ్మధారలో కొలువై ఉన్న శ్రీ మహా గణపతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, షిర్డీ సాయిబాబా ఆలయాలను రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు.

Ministers visiting temples located in Seethammadhara
సీతమ్మధారలో కొలువై ఉన్న దేవాలయాలను దర్శించుకున్న మంత్రులు

By

Published : Mar 10, 2021, 7:43 AM IST

విశాఖ నగరం సీతమ్మధారలో కొలువై ఉన్న శ్రీ మహా గణపతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, షిర్డీ సాయిబాబా దేవాలయాలను జిల్లా ఇంచార్జీ మంత్రి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పర్యాటక.. సాంస్కృతిక.. యువజనాభివృద్ధి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.

దేవాలయంలో నిర్వహించిన రుద్ర పారాయణం, రుద్ర హోమ కార్యక్రమంలో కన్నబాబు, అవంతి పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రులు కోరుకున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రార్థించారు. ప్రత్యేక పూజలు అనంతరం అర్చకుల నుంచి ప్రసాదం, ఆశీర్వచనం అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details