'ఏపీలో నిరసన సెగ' - నిరసనలు
మోదీ రాకను నిరసిస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తూ నిరసనలు తెలిపారు. వామపక్ష కార్యకర్తలు మట్టికుండలతో ఆందోళన చేశారు.
మోదీ రాకను నిరసిస్తూ విశాఖలోజీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్‌లతో పాటు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, రామకృష్ణ బాబు దీక్షలు చేస్తూ నిరసనలు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ వివిధ పార్టీల నేతలు ఆందోళన చేశారు. గాంధీ విగ్రహం నుంచి రైల్వేస్టేషన్ వరకు వామపక్ష కార్యకర్తలు మట్టి కుండలతోర్యాలీ నిర్వహించారు. డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ర్యాలీని నిర్వహిస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.