విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల అందించే వాహనాలకు జెండా ఊపి మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు ప్రారంభించారు. అనంతరం మంత్రి అవంతి స్వయంగా వాహనాన్ని నడిపారు.
'త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన చేస్తారు' - minister kannababu latest news
విశాఖలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను ప్రారంభించారు. జిల్లాలో 828 వాహనాలు లబ్ధిదారులు సరుకులు అందిస్తాయని మంత్రి అవంతి పేర్కొన్నారు. తెదేపా కడుపు మంట బ్యాచ్ అని..దీనిపై కూడా విమర్శలు చేస్తోందని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.
ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల వాహనాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో 828 వాహనాలు లబ్ధిదారులకు సరుకులు అందిస్తాయని అన్నారు. త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన చేస్తారని.. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా ఆగదని చెప్పారు. జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. తెదేపా కడుపు మంట బ్యాచ్ అని..దీనిపై కూడా విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్లు: మంత్రి శంకర్ నారాయణ