ప్రభుత్వం ఇసుక కొరతను అధిగమించిదని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇసుక దరఖాస్తు పెట్టుకున్న 2 గంటల్లోనే సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందన్న కన్నబాబు... ప్రభుత్వమే కొరత సృష్టించినట్లు... ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ... 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు... అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని విమర్శించారు. అందుకే పవన్‌కల్యాణ్‌తో లాంగ్ మార్చ్ చేశారని ఆరోపించారు.
'దరఖాస్తు చేసుకున్న 2 గంటల్లోనే ఇసుక సరఫరా' - latest ysrcp ministers meeting in vizag
ఇసుకతో నగదు దండుకోవడం తెదేపా నేతలకు తెలిసినంతగా... ఇంకెవరికీ తెలియదని మంత్రి కన్నబాబు ఆరోపించారు. విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
!['దరఖాస్తు చేసుకున్న 2 గంటల్లోనే ఇసుక సరఫరా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5067301-1100-5067301-1573754433549.jpg)
మంత్రుల మీడియా సమావేశం