అరకులోయ నుంచి కిందికి వస్తున్న ఓ టూరిస్టు బస్సు లోయలోకి దూసుకెళ్లి చిన్నారి సహా నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. మృతులంతా హైదరాబాద్ వాసులే. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరామర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రులు తెలిపారు. తెలంగాణకు చెందిన అధికారులు కూడా వైద్య సేవల్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. నిన్న ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 27 మంది ఉన్నారు. వీరిలో నలుగురు మృతి చెందగా.. 23 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
అరకు ఘాట్ రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ - అరకు బస్సు ప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ న్యూస్
విశాఖ జిల్లా అరకు డుముకు మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
![అరకు ఘాట్ రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ అరకు ఘాట్ రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10610464-929-10610464-1613214145771.jpg)
అరకు ఘాట్ రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ
వైద్య సేవలు పర్యవేక్షిస్తున్న తెలంగాణ అధికారులు
మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌లో వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. బ్రేక్ ఫెయిల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ శ్రీశైలం చెబుతున్నాడని.. జాయింట్ కమిషనర్, జేటీవో, పాడేరు ఐటీడీఏ పీవోతో ప్రమాద ఘటనపై కమిటీ వేశామని తెలిపారు. ప్రమాద కారణాలు 10 రోజుల్లో నివేదికను కమిటీ ఇస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అరకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
Last Updated : Feb 13, 2021, 5:31 PM IST