Vidadala Rajini: రాష్ట్రంలో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. కొవిడ్ పరిస్థితులపై విశాఖ జీవీఎంసీ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం కరోనా కేసుల పట్ల హెచ్చరికలు జారీ చేసిందన‌్న మంత్రి.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి హెల్త్ సెంటర్లో రాపిడ్ టెస్ట్లు నిర్వహించేలా కిట్స్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాతో పాటు మాస్కుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు.
కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విడదల రజిని - ఏపీ తాజా వార్తలు
Vidadala Rajini: కేంద్రం కరోనా కేసుల పట్ల హెచ్చరికలు జారీ చేసిన వేళ.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విశాఖ జీవీఎంసీ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కొరత లేకుండా చూస్తామని చెప్పారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
"గత అనుభవాల దృష్ట్యా.. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతానికి ఎటువంటి ఆంక్షలు లేవు. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు".- విడదల రజని , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి :