స్వరూపానందేంద్ర స్వామిని మంత్రి వెల్లంపల్లి కలిశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. రామతీర్థం ఘటనపై తక్షణం నిజనిర్ధారణ కమిటీని వేయాలని.. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితిని విధించాలని సూచించారు. దోషులకు కఠినంగా శిక్షించాలన్నారు. వాస్తవాలను వెలికి తీయడంలో పోలీసులు విఫలమయ్యారని స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు.
రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి: స్వరూపానందేంద్ర - రామతీర్థం ఘటనపై స్వరూపానందేంద్ర సరస్వతి కామెంట్స్
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలిశారు. దేవాలయాల్లో దాడులపై స్వామిజీ ఆందోళన వ్యక్తం చేశారు.
రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి: స్వరూపానందేంద్ర