విశాఖ మన్యంలో ఐటీడీఏలో అధికారులతో మంత్రి పుష్ప శ్రీవాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించాలని గిరిజనులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. కానీ అధికారులు పోలీసులను మోహరించి ప్రజలను అదుపుచేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న సిబ్బంది, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న తాత్కాలిక వంట మనుషులు, గిరిజన ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నుంచి మంత్రి వినతులు స్వీకరించారు.
మంత్రిని కలిసేందుకు గంటలపాటు నిరీక్షణ.. అయినా...
విశాఖ మన్యంలో మంత్రి పుష్ప శ్రీవాణి ఐటీడీఏలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అయిన తరువాత తొలిసారి రావటంతో గిరిజనులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసులు, అధికారులు భారీగా మోహరించి ప్రజలను అదుపుచేశారు.
minister pushpasrivani visits visakha dst tribal area
జి.మాడుగుల మండలం జన్నేరులో అత్యాచారానికి గురైన బాలిక సైతం వినతి ఇవ్వడానికి వచ్చింది. ప్రభుత్వం ఏదో విధంగా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ అధికారులు, పోలీసులు వల్ల గిరిజనులు చాలాసేపు వేచి చూసి వెనుదిరాగారు.
ఇదీ చూడండి :13 నెలలుగా పోలవరంపై ఆన్‌లైన్లో సమాచారం వెల్లడించలేదు'