రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ది పథకాలు దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు - సింహాద్రి అప్పన్న వార్తలు
విశాఖలోని సింహాద్రి అప్పన్నను మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. రాష్ట్రప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు