మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా.. విశాఖ జిల్లా భీమునిపట్నంలోని చిట్టివలసలో వాలంటీర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్, వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. వైకాపా నేతలు, కార్యకర్తలు మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తగరపువలస వర్తక సంఘం ఆధ్వర్యంలో ముత్తంశెట్టిని సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
మంత్రి జన్మదినం.. వాలంటీర్లకు నిత్యావసరాల పంపిణీ - విశాఖలో మంత్రి ముత్తంశెట్టి జన్మదిన వేడుకల వార్తలు
అవినీతిరహిత సమాజమే ధ్యేయంగా ప్రభుత్వం కృషిచేస్తోందని.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా విశాఖ జిల్లా చిట్టివలసలో వాలంటీర్లకు నిత్యావసరాలు అందజేశారు.
మంత్రి జన్మదినం.. వాలంటీర్లకు నిత్యావసరాలు పంపిణీ