ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం: మంత్రి ముత్తంశెట్టి

వరద ముంపుతో పంటలు నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విశాఖ జిల్లా రాజుల రాంబిల్లి, అచ్యుతాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతులను కలిసి పంట నష్టంపై ఆరా తీశారు. కాలువ గండ్లను పరిశీలించారు. పంట నష్టంపై అధికారుల నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

muttamsetti srinivas
muttamsetti srinivas

By

Published : Oct 14, 2020, 6:08 PM IST

వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విశాఖ జిల్లాను ముంచెత్తాయి. వరద నీరు చేరి శారద, తాండవ నదులు పొంగి ప్రవహించాయి. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చాలా గ్రామాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయి.

పర్యటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ బి.వి సత్యవతి, ఎలమంచిలి ఎమ్మెల్యే యు.వి కన్నబాబు... రాజులు రాంబిల్లి, అచ్యుతాపురం గ్రామాల్లో పర్యటించారు. రైతులను కలిసి పంట నష్టాన్ని తెలుసుకున్నారు. ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ముత్తంశెట్టి రైతులకు భరోసా ఇచ్చారు.

మంత్రి అవంతికి ముంపు పరిస్థితిని వివరిస్తున్న అధికారులు

ముంపునకు గురైన 7 గ్రామాల ప్రజలను ఆదుకుంటామని, పునరావాసం కల్పిస్తామని మంత్రి తెలిపారు. పంట నష్టంపై అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. పొలాల ముంపునకు శారదా నదిపై నిర్మించిన వంతెన ఒక కారణమని రైతులు చెబుతున్నారని, నేవీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కాలువలకు ఏర్పడిన గండ్ల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి తెలిపారు.

ముంపు గ్రామాల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పర్యటన

ఇదీ చదవండి:

ఎస్‌ఎస్‌సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీం తీర్పునకు విరుద్ధం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details