కేంద్రంలోని భాజపా ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ.. కార్మిక సంఘాలతో కలసి ఉద్యమిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చైతన్య స్రవంతి సంస్థ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు మంత్రి సంఘీభావం తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణమని అన్నారు.
విశాఖ ఉక్కు.. ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం దారుణం: అవంతి - ప్రైవేటీకరణపై మంత్రి అవంతి కామెంట్స్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కార్మిక సంఘాలతో కలసి ఉద్యమిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
Last Updated : Feb 13, 2021, 5:42 PM IST