ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష్మీనృసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి - సింహాద్రి అప్పన్న ఆలయం

లాక్ డౌన్ అనంతరం తొలిసారి విశాఖ సింహాచలం లక్ష్మీనృసింహస్వామి వారిని... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ... ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ స్వామివార్ల దర్శనం చేసుకోవాలని కోరారు.

minister muttamsetti in simhachalam temple
లక్ష్మీనృసింహుని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి

By

Published : Jun 10, 2020, 2:13 PM IST

విశాఖ సింహాచలం లక్ష్మీనృసింహస్వామి వారిని... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. లాక్ డౌన్ అనంతరం తొలిసారి స్వామివారి ఆలయానికి ఆయన విచ్చేశారు. ఆలయ అధికారులు మంత్రికి సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ... కరోనా వైరస్​కు మందు వచ్చేవరకు ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం జీవనంలో భాగం చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details