సింహాద్రి అప్పన్నను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ ఆలయ ఈవో వెంకటేశ్వరరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ....రైతుల సమస్య, అక్రమ కట్టడాల గురించి సీఎంతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా చేస్తామని అన్నారు. అలాగే పంచగ్రామాల భూసమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అప్పన్న సేవలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి - విశాఖ అప్పన్నను దర్శించుకున్నఎంపీ విజయసాయిరెడ్డి
సింహాచలం అప్పన్నను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిలు దర్శించుకున్నారు.
అప్పన్న సన్నిధిలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి