విశాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై నియోజకవర్గాల వారీగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. కొవిడ్-19, ఇళ్ళ పట్టాల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలు, నాడు- నేడు కార్యక్రమం, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ చేయూత, ఈ-క్రాప్ డేటా ఎంట్రీ, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ తదిదర అంశాలపై పై సమీక్ష నిర్వహించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ముత్తంశెట్టి
ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. కొవిడ్-19 నివారణ, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాల పంపణీ, ఉపాధి హామీ పథకం అమలు, నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, తదితర అంశాలపై సమీక్ష జరిగింది.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింతగా ప్రజల్లో అవగాహన తీసుకెళ్లాలని...ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. నియోజకవర్గస్థాయిలో కరోనా నివారణలకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులు బారిన పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, అదీప్ రాజ్, ఉమ శంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, కన్నబాబు, ముత్యాల నాయుడు, అరకు ఎంపీ మాధవి హాజరయ్యారు.
ఇవీ చదవండి:కరోనా స్వైరవిహారం.. బెంబేలెత్తిస్తున్న పాజిటివిటీ